- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
అభివృద్ధికి సూచికగా కాంగ్రెస్ ప్రభుత్వ నిలుస్తుందని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజఫర్ ఖాన్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధి పనుల జాతరను శుక్రవారం జన్నారం మండలంలోని పోన్కాల్ గ్రామపంచాయతీలో వారు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అనంతరం పలు గ్రామాల్లో పశువుల షెడ్లు అంగన్వాడి కేంద్రాలకు భూమి పూజ చేశారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, వైస్ ఛైర్మన్ పసివుల్లా ఈవో రాహుల్ కాంగ్రెస్ నాయకులు దూమల్ల రమేష్ మామిడిపల్లి ఇందయ్య ఇసాక్ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -