Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..

- Advertisement -

– మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య..
నవతెలంగాణ – ఊరుకొండ 

బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని జకినాలపల్లి మాజీ ఉపసర్పంచ్ పోలే చంద్రయ్య అన్నారు. సోమవారం ఊరుకొండ మండల పరిధిలోని జకినాలపల్లి గ్రామానికి చెందిన ఎండి. ఇమామ్ కు 36వేలు మరియు అమ్మపల్లి తండాకు చెందిన దేశ్యనాయక్ కు రూ.24,500/- భాస్కర్ కు 18వెల్ రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. చెక్కుల మంజూరుకు సహకరించి అండగా నిలిచిన జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, చిన్న వెంకటయ్య, పోలే లింగమయ్య, శేఖర్, మహేష్, నరేందర్ రెడ్డి, నర్సింహ, గెల్వయ్య, జంగయ్య, జెపాల్, మైబుల్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -