Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిగ్‌ వర్కర్లకు కాంగ్రెస్‌ ద్రోహం చేసింది

గిగ్‌ వర్కర్లకు కాంగ్రెస్‌ ద్రోహం చేసింది

- Advertisement -

– సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గిగ్‌ వర్కర్లకు కాంగ్రెస్‌ పార్టీ తీరని ద్రోహం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అభయ హస్తం డిక్లరేషన్‌లో గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ విడుదల చేసిన ఆ పార్టీ ..అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిగ్‌ వర్కర్లకు అండగా ఉంటామన్న కేటీఆర్‌… వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు గిగ్‌ వర్కర్ల కసోం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు, బీమాతో కూడిన సామాజిక భద్రత, సరైన వేతనాలతో పాటు మరణించిన కార్మికులకు పరిహారం చెల్లింపు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ కోరారు. గిగ్‌ వర్కర్ల హామీల అమలు బాధ్యతను తీసుకుంటానన్న రాహుల్‌ గాంధీ, వీరి సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తే బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్‌ తెలిపారు.

రైతు ద్రోహి కాంగ్రెస్‌.. ప్రజా ద్రోహి బీజేపీ
రైతు ద్రోహి కాంగ్రెస్‌.. ప్రజా ద్రోహి బీజేపీ అని కేటీఆర్‌ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ యూరియా అడిగితే రైతులపై రేవంత్‌ సర్కార్‌ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తోందనీ, జీఎస్టీ పేరుతో ఎనిమిదేండ్లలో బీజేపీ రూ.15 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయలేదని కేటీఆర్‌ విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -