– డిసిసి జిల్లా అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి
– ఘనంగా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – వనపర్తి : స్వాతంత్రానికి పూర్వం 30 కోట్ల భారత జనాభా కలిగిన దేశానికి స్వాతంత్రం తేవడానికి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొత్త కాపు శేషనా రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొత్త కాపు శివసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ విధంగా ఆనాడు 30 కోట్ల జనాభాకు తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు అని అని వారు మాట్లాడారు. కానీ నేడు 130 కోట్ల భారత జనాభా చెంత డెవలప్డ్ కంట్రీగా వెలుగొందుతుందన్నారు. అంటే ఎయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్ దాకా మన దేశంలో తయారవుతున్నాయంటే అది ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రి చేసిన ఘనతనే అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అజరామరమని కొనియాడారు. 140 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దేశ అభివృద్ధిలో ప్రజా సంక్షేమంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. అదే స్ఫూర్తితో వనపర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరం కలిసి కట్టుగా పని చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం (ప్రజా ప్రభుత్వం) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మాజీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం చారి, మధు గౌడ్, మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మాజీ కౌన్సిలర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, సేవాదళ్, ఐ ఎన్ టి యు సి, వక్స్ బోర్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



