Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ 

కాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ 

- Advertisement -

– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయములో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్  షబ్బీర్  అలీ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను దాదాపు రూ.16 లక్షలచెక్కులను లబ్దిదారులకు  పంపిణి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలోనీ  పలు గ్రామాలలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత  ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా, పేదలకు అండగా  నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు  అందిస్తాం అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం ఆని, రుణమాఫీ చేసి చూపించాం, రైతు భరోసా అందిస్తున్నాం అన్నారు.  మహిళలకు ఉచిత బస్సు,  500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకము ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి పొందచ్చు అని, భూభారతి ద్వారా రైతుల సమస్యలు శాశ్వతంగా తొలిగిపోతాయి అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad