Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్

రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్

- Advertisement -

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం..
మండలానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 
నవతెలంగాణ  – మిరుదొడ్డి 

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం తీరంగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం అక్బర్ పేట భూంపల్లి మండలం కాజిపూర్ గ్రామంలో రైతులు దళాలకు అమ్ముతున్నారని విషయం తెలుసుకుని రైతులతో మాట్లాడి ముచ్చటించారు. ఇట్టి విషయాన్ని  జిల్లా అధికారులకు ఫోన్లో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. రైతులు దళాలకు అమ్మడం వలన సుమారుగా రూ.600 నుండి రూ.1000 నష్టపోతున్నారని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు.

వెంటనే ఉన్నత అధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దుబ్బాక నియోజకవర్గం లో తొగుట, దుబ్బాకలో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో అధికంగా మొక్కజొన్న పండిన ప్రాంతంలో తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మండలానికి ప్రతి ఒక్కటి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని వారన్నారు. రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు లేకపోవడం మూలంగానే దళాలను ఆశించడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ పంజాల కవిత శ్రీనివాస్ గౌడ్ , ఖాజాపూర్ గ్రామస్తులు, మోహన్ రెడ్డి, నర్సింలు చిరంజీవి తోపాటు రైతులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -