Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు: మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య

బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు: మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు గైరాజర్
రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అయ్యా కె రిజర్వేషన్లు ఇస్తారా?
రిజర్వేషన్ అమలయ్యాక స్థానిక సంస్థలు ఎన్నిక లు జరపాలి
నవతెలంగాణ – ఆలరు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ ఢిల్లీలో  జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు గైరాజా కావడం చూస్తే అర్థమవుతుంద నీ మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా గురువారం నాడు ఆయన మాట్లాడుతూ ఢిల్లీ  ధర్నాలో ఏఐసిసి అధ్యక్షులు కార్గే గాని. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏ ఒక్కరూ పాల్గొనక పోవడం. నిదర్శనం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు గంటలు మాయమై తర్వాత వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం అనడం సిగ్గుచేటు అన్నారు.

బిజెపి మీద నేపం నెట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునేందుకు రిజర్వేషన్ ఇవ్వకుండా నాటకాలు ఆడుతుందన్నారు.బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె సి ఆర్ ముందే చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రభుత్వం కుల గణన చేసేటప్పుడు అనేక తప్పులు చేశారని బీసీలను మభ్య పెట్టేందుకే అని వారు చెప్పినట్లుగానే తేటతెల్లమవుతుందన్నారు.42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ దే అని ఎన్నికల ముందు బిసి డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకున్నారని బీసీలను మోసం చేస్తే సహించేదే లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చట్టబద్ధత కల్పించి బీసీ రిజర్వేషన్ వచ్చాకే ఎన్నికలు జరిపించాలని బిఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img