Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నాయకుడు రాజు గౌడ్ కు ఘన సన్మానం

కాంగ్రెస్ నాయకుడు రాజు గౌడ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు పెరుమాండ్ల రాజు గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువతో ఘనంగా సన్మానించినట్లు ఆ గ్రామ యువ నాయకులు జెల్ల యాకన్న, జెల్ల ఉపేందర్, గదారి నగేష్ జెల్ల మురళి, ఎడెల్లి మధు సిహెచ్ ఉపేందర్ తెలిపారు. గురువారం మిఠాయిలు పంచుకొని పేదలను అభివృద్ధి పరిచేందుకు ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల నాయకుడు ఆయన రాజు గౌడ్ నా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి శుభాకాంక్షలు అని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చి అధిక ఇండ్లను తీసుకువచ్చి సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరేందుకు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ అభివృద్ధి కోసం మండల జిల్లా నాయకులు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -