Wednesday, July 23, 2025
E-PAPER
Homeకరీంనగర్డీఎస్పీ మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు

డీఎస్పీ మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు

- Advertisement -

– కట్టరాంపూర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చిన పార్లమెంట్ ఇన్‌చార్జి
నవతెలంగాణ – కరీంనగర్

ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన డీఎస్పీ మహేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు మంగళవారం సాయంత్రం పరామర్శించారు. కరీంనగర్ కట్టరాంపూర్‌లో ఉన్న వారి నివాసానికి వెళ్లిన ఆయన, హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. డీఎస్పీ మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాజేందర్ రావు… మహేష్ మరణ వార్తకు తీవ్ర దిగ్భ్రాంతి చెందినట్లు చెప్పారు.

“మహేష్ మంచి పోలీస్ అధికారిగా ప్రజల్లో విశేష గౌరవం సంపాదించుకున్నారు. మా కుటుంబంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది,” అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆర్ష మల్లేశం, ఆకుల నరసన్న, పిట్టల లింగయ్య, కట్ల సతీష్, కోడూరి రవీందర్ గౌడ్, అనంతుల రమేష్, పడిశెట్టి భూమయ్య, జక్కని ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -