నవతెలంగాణ – బోనకల్
మండల పరిధిలోని బోనకల్ – ఆళ్లపాడు రోడ్డు మరవద్దు పనులను ఆళ్లపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు బుధవారం పరిశీలించారు. పనులను ఆళ్లపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆత్మ కమిటీ డైరెక్టర్ కందుల పాపారావు సీనియర్ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు బుంగ రాములు పారా వెంకట మోహన్ రావు పరిశీలించారు. సూపర్వైజర్ మురళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పనులు శరవేగంగా చేపడతామని రెండు మూడు నెలల్లోనే రోడ్డు పనులు పూర్తి చేస్తామని సూపర్వైజర్ వారికి తెలిపారు.
ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని వాటిని పక్కన పెడదామని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. అభివృద్ధి పనులను గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల బీసీ సెల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల పాపారావు, ఆళ్లపాడు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బుంగ రాములు, మండల కాంగ్రెస్ నాయకుడు పార వెంకట మోహన్ రావు, తోటకూర వెంకటేశ్వరరావు, దొంతేబోయిన వెంకయ్య, టిడిపి నాయకులు మరీదు బరకయ్య, తదితరులు పాల్గొన్నారు.



