నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మున్సిపల్ పరిధిలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదవారి ఇంటి కల నెరవేరిందని గత 30 సంవత్సరాలుగా పేదింటి కుటుంబాలకు ఇల్లు లేక ఎన్నో అవస్థలు పడ్డారని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసి దశలవారీగా లక్ష చొప్పున ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని అన్నారు. 269 ఇండ్లు మంజూరు కాగా 201 నిర్మాణంలో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజల కోసం నిరంతర సేవ విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్నామన్నారు. ఆయన వెంట నాయకులు సంతప్పా, అసద్ అలీ, దర్పల్ దశరథ్, రవి పటేల్, తుకారాం, సాయిలు, యోగేష్, బాలకృష్ణ, హనుమాన్లు, ఉత్తం నాయక్, సీమగంగారం, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES