నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ సంజు దేశాయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే ఆధ్వర్యంలో భీఆర్ఎస్ పార్టీలో చేరగా భీఆర్ఏస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ సర్పంచ్ సంజు దేశాయి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధాల హామీలు నెరవేర్చలేకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక తిరగలేకపోతున్నామని కెసిఆర్ హాయంలో గత ప్రభుత్వం ప్రజలకు చేరువై ఎంతో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామస్థాయిలో ప్రజలకు న్యాయం చేసిందని అందుకే బిఆర్ఎస్ పార్టీలోకి చేరామని రానున్న స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రాజు, రాజు డాక్టర్, నాయకులు బసవరాజ్ పటేల్ శివానంద్, శివరాజ్, మహన్ తప్ప, కల్లప్ప, బస్వంత్, బీరుగొండా, నర్సింహులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నాయకుల చేరిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES