Sunday, October 12, 2025
E-PAPER
Homeజిల్లాలుపాండిచ్చేరి మాజీ సీఎంను కలిసిన కాంగ్రెస్ నాయకులు

పాండిచ్చేరి మాజీ సీఎంను కలిసిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు, అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ(డిసిసి) నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు, పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమ్ంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి,మోతీలాల్ నాయక్,పర్వత్ రెడ్డి,తక్కళ్ళపల్లి శేఖర్,కొయ్యల పుల్లయ్య,కడారి శ్రీనివాస్ యాదవ్,పాండు నాయక్,రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -