Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరా గాంధీ కి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

ఇందిరా గాంధీ కి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

 నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో  ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ పేరు చరిత్ర గర్వం, భారతదేశానికి నిత్య చైతన్య స్ఫూర్తి పదం, గరీబ్ కు హటావో, బ్యాంకులు జాతీయం లాంటి విప్లవత్మక నిర్ణయాలతో దేశ ప్రగతి కోసం పాటుపడిన మహా నాయకురాలు భారతదేశ తొలి మహిళా ప్రధానిగా భారతరత్న అవార్డు అందుకున్నారు. అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, దామోదర్ గౌడ్, గోరేటి శ్రీను, సంతు యాదవ్, జమ్ముల శ్రీకాంత్, మహిళా నాయకురాలు, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -