నవతెలంగాణ – పరకాల
మూంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు, పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, వర్ష ప్రభావిత ప్రజలకు భరోసా కల్పించారు. లోతట్టు ప్రాంతాల పర్యవేక్షణ కొయ్యడ శ్రీనివాస్ బృందం పట్టణంలోని ప్రధానంగా శ్రీనివాస కాలనీ, మమతా నగర్, ఆంధ్ర బ్యాంకు పరిసర ప్రాంతాలు, సిఎస్ఐ కాలనీ,భూపాలపల్లి రోడ్డులోని ఎంఆర్ రెడ్డి కాలేజ్ ఎదురుగా గల నీటి నిల్వలను గుర్తించి వాటి పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి పట్టణంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాల వల్ల ఎన్నో వార్డులలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ప్రకాష్ రెడ్డి పట్టణంలో నెలకొన్న ప్రధాన డ్రైనేజీ సమస్యను గుర్తించి, రూ. 30 కోట్లతో వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని చేపడుతున్నారని గుర్తు చేశారు. ఈ డ్రైనేజీల నిర్మాణం వలనే ప్రస్తుతం పరకాల పట్టణంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని, లేకుంటే ఈ వర్షం దాటికి ముప్పు వాటిల్లేదని పేర్కొన్నారు. పరకాల పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే ఏకైక లక్ష్యంగా ముందుకు పోతున్నారని కొయ్యడ శ్రీనివాస్ తెలిపారు.
వర్షం నీరు ఇళ్లలోకి చేరి నష్టపోయిన కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు కలిసి, వారికి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యేతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ఎస్ సి సెల్ ఉప అధ్యక్షుడు మడికొండ శ్రీను, చందుపట్ల రాఘవరెడ్డి, పసుల రమేష్, దార్న వేణుగోపాల్, మెరుగు శ్రీశేలం, బండి సదానందం, పోరండ్ల వేణు, ఒంటెరు శ్రావణ్, గడ్డం శివ, మంద నాగరాజు, బొమ్మకంటి రుద్రమ చంద్రమోళి, బొచ్చు మోహన్, సూదమల్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


