Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని పాత రుద్రారంకు చెందిన ఆకుదారి సుమన్ ఇటీవల చనిపోయారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుల ఆదేశాల మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరమార్శించారు. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించి 50 కిలోల సన్నబియ్యం, రూ.2వేలు ఆర్థిక సాయం అందజేశారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిగురు సదయ్య, వార్డు సభ్యులు జాడి రాజశేఖర్, జాడీ అనసూయ సమ్మయ్య, జాడి రాజయ్య, నగరపు ప్రభాకర్, చివరి శంకర్, జాడి దేవేందర్, జగజంకుల అంకయ్య, సేగం లింగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -