Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో హైదరాబాద్ కు తరలిన కాంగ్రెస్ నాయకులు

చలో హైదరాబాద్ కు తరలిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : జుక్కల్ మండలానికి చెందిన సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు చలో హైదరాబాద్‌, ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ నినాదంతో జరుగుతోంది. సభకు ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యాంగంపై అవగాహన కల్పించడం అని తెలిపారు.

బాపూ, అంబేద్కర్ ఆశయాల ప్రకారం.. సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయి నాయకత్వాన్ని శక్తివంతం చేయడం, కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నింపడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం గ్రామాల మధ్య ఐక్యతను చాటిచెప్పే మైలురాయిగా నిలవనుంది తెలిపారు. జై కాంగ్రెస్ , జై రాజ్యాంగం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -