- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: కాళేశ్వర సరస్వతి పుస్కరాల్లో భాగంగా ఆదివారం కాటారం ప్రధాన రహదారిపై కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న క్షతగాత్రులు చెట్లల్లో పడిపోవడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షతగాత్రులను జెసిబి సహాయంతో చెట్లను తొలగించి బాధితులను బయటకు తీసి అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పoతకాని సమ్మయ్య,మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్,యువజన కాంగ్రెస్ నాయకులు చిలువేరు మహేష్ తోపాటు కాటారం ఎస్ఐ అభినవ్ పాల్గొన్నారు.
- Advertisement -