బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామం లో శనివారం మార్కల రాజు, రావలీల నివాసగృహం అగ్ని ప్రమాదానికి అహుతైంది. ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఆ దుర్ఘటన ఆ కుటుంబాన్ని నిర్గాంతం లోకి నెట్టింది. విషయం తెలుసుకున్న ధర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ మేమున్నామంటూ తనవంతుగా బాధిత కుటుంబనికి రూ.10,000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రూ.5000 వేల రూపాయలు, సిర్నాపల్లి మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్ తనవంతుగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చుక్కబొట్ల గంగమని కొత్త చీరలు, యాచారం సాయిలు 25 కిలోల బియ్యాన్ని ఆదివారం అందజేశారు.
జరిగిన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు ఎల్ఐసి గంగాధర్ మాట్లాడుతూ అందరు కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి ఇందిరమ్మ గృహాన్ని మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాన్ని సైతం అందజేసే విధంగా చూస్తామని మరో ధైర్యం కోల్పోకుండా ఉండాలని వారికి కొండంత భరోసా కల్పించారు. ఆర్థిక సహాయం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గన్నారం గ్రామ అధ్యక్షుడు బద్దం రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దామ సుమన్, ఉపాధ్యక్షులు రోహిత్ గౌడ్, సిర్నాపల్లి గ్రామ నాయకులు యాచారం సాయిలు, తదితరులు ఉన్నారు.