Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండవ విడత ఎన్నికలలో కాంగ్రెస్ ముంగంజ 

రెండవ విడత ఎన్నికలలో కాంగ్రెస్ ముంగంజ 

- Advertisement -

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొదటి విడతల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన విధంగానే రెండవ విడతలో కూడా అత్యధిక స్థానాలు గెలిచి ముందంజలో ఉందని నిజామాబాద్ అధ్యక్షులు నగేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చే విధంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతాము.రెండవ విడతలో జరిగిని 196 సర్పంచ్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 137 స్తనాలు కైవసం చేసుకోవడం జరిగింది.

ఇందులో దాదాపు సగం స్తనాలు ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులకు ఏకగ్రీవం అయ్యాయి.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజాపాలన ఎంత విజయవంతంగా చేస్తున్నారో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారో తెలపడానికి ఇదే నిదర్శనం. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే ఇందుకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు ఓటు వేసి కాంగ్రెస్ నాయకులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -