Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి 

- Advertisement -

– వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ –  కామారెడ్డి
: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాలరాజు గూడ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయ ఏవో కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు.

ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం అబివృద్ధి గురించి ఎన్నికల  మ్యానిఫెస్టోలో పేర్కోన్న అంశాలు వాటి అమలుకు ఇచ్చిన హమీల విషయంతో పాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి గతంలో ప్రభుత్వం మందు పెండింగ్లో ఉన్న పలుఅంశాల అమలుకై విహేచ్్ప వ్యవస్థాపక అధ్యక్షులుగా మందకృష్ణ మాదిగ ప్రభుత్వ పెద్దలకు సామాజిక బాధ్యతనే కాకుండా మానవియకోణంతో విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పడి ఇప్పటికి 18 నెలలు కావస్తున్నప్పటికి అన్ని అవయవాలు ఉండి ఏదో ఒక పని చేసుకోని జీవించే వారికి ఏదో విధంగా మీకు వీలు అయినంత వరకు హమీలు నేరవేర్చుకుంటూ వస్తున్నారు.

అవయవ లోపాలు ఉండి ఎలాంటి పనులు చేసుకోలేకున్న వారికి, కన్న తల్లిదండ్రులకు తోడబుట్టిన వారిజీవిత బాగస్వాములకు ఇటు ఇంట్లో, అటు సమాజంలో వివక్షతకు గురవుతున్న వికలాంగులకు ఇచ్చిన హమీలు నేరవేర్చకపోవడం బాధకరం అన్నారు. ఈ విషయాలను ఆయా సమాయా సందర్బలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి చెబూతు వస్తుందన్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ ప్రభుత్వం ( గత, ప్రస్తుత ) నుంచి స్పందన లేదన్నారు. ఇప్పటికైన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కోన్న అంశాలతో పాటు ఎప్పటి నుండో ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలను వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ క్రింది అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము అన్నారు.

వైన్ షాపులలో టెండర్లు లేకుండా వికలాంగులకు ఇవ్వాలి, 4 శాతం రిజర్వేషన్ కల్పించలని, వికలాంగుల వివాహ ప్రోత్సహక బహుమతులు  రూ.5 లక్షలకు పెంచాలి, వికలాంగుల పిల్లలకు కార్పోరేటు స్కూల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు షైక్ హుస్సేన్, నహీంద్దీన్, రాజనర్సు, సుజాత, ఆఫీజా, సాయిలు, ఎల్లయ్య, ఎమ్మార్పీఎస్  ముఖ్య నాయకులు మంతని సామెల్, పద్మ రావు, కొత్తల్లా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -