Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓపిఎస్ ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి

ఓపిఎస్ ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి

- Advertisement -

  • – టి పి టి ఎఫ్ మహబూబాద్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్

నవతెలంగాణ నెల్లికుదురు: సిపిఎస్ ను రద్దుచేసి ఓ పీ ఎస్ ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చాడని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టి పి టి ఎఫ్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. టీపీటీఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు బి.శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీ యుపిఎస్ నరసింహులగూడెం పాఠశాల యందు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం(ఓపిఎస్)ను తక్షణమే అమలు చేయాలని కోరుతూ భోజన విరామ సమయం లో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలిపారు. 01.09.2004 తరువాత నియమాకమైన ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని అప్పటి ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చి తీవ్ర నష్టం చేకూర్చాయని, 25 నుండి 30 సంవత్సరములు సేవ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ పథకం ద్వారా సామాజిక పెన్షన్ అందుకుంటున్న వారి కంటే తక్కువ పెన్షన్ రావడం జరుగుతుందన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల నుండి 10% కాంట్రిబ్యూషన్ వసూలు చేసి కార్పొరేట్ శక్తులకు అందిస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగుల భద్రత పట్ల నిర్లక్ష్యం సరైనది కాదు అని ఆవేదన వ్యక్తం చెందారు. పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తూ, ఉద్యోగులను టెన్షన్ కు గురిచేసే సిపిఎస్ ను తక్షణమే రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించాలని, తద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఓపిఎస్ ను అమలు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ ,సయ్యద్ , మమత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad