నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్యరంగాలను కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శించింది. ఆదివారం హైదరాబాద్ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ హేమా జిల్లోజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్‌లు చలో అసెంబ్లీ పోస్టర్ విడుదల చేశారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ సమయంలో విద్యకు 25 శాతం కేటాయించిందని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కేవలం 8.22 శాతం కేటాయింపులతో, రూ.500 కోట్లు యంగ్ ఇండియా స్కూళ్లకు కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు.
రాష్ట్ర వైద్య రంగానికి కేవలం రూ.13,679 కోట్లు (4.21 శాతం)తో సరిపెట్టి ప్రయివేటు ఆస్పత్రులను పోషించేలా బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌తో సామాన్యుల జీవితాల్లో మార్పు రాదని కొట్టిపారేశారు. విద్య, వైద్య రంగాలకు కలిపి కేటాయింపులను 30 శాతానికి పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పరీక్ష రాజ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా వైద్యం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం : ఆప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



