- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జాతీయ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ నిర్ణయాలను విభేదించి జిల్లాలోని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ గా పోటీ చేసిన అభ్యర్థులతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాగుల రాము గౌడ్, హైమద్ పాషా, కుమ్మరి శేఖర్, ఇర్ఫాన్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెంగల అశోక్ శ్రీరాముల వెంకటేశం గోనె శరణ్య బూర యాదగిరి లను సస్పెండ్ చేసినట్లు జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ప్రకటించారు.
- Advertisement -



