వర్షాకాల సమావేశాల వ్యూహంపై చర్చ
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఈ నెల 15వ తేదీ బుధవారం సమావేశమవు తుంది. సీపీపీ నాయకురాలు సోనియాగాంధీ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. అనేక అంశాలపై ఉభయ సభలలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, ప్రభుత్వం చేపట్టిన దౌత్య యత్నాలపై పార్లమెంటులో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
సీపీపీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. 10, జన్‌పథ్‌లో జరిగే ఈ సమావేశానికి సోనియా అధ్యక్షత వహిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ఆగస్ట్ 21 వరకూ జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఇది వారం రోజులు అదనం. శాసన సంబంధమైన అజెండా భారీగా ఉన్నందున సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగాన్ని అనుమతించడం సహా పలు కీలక బిల్లులను ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టవచ్చు
15న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
- Advertisement -
- Advertisement -