నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేర్ పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల అభ్యర్థులను పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రకటించారు. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసారపు యాదగిరి, నియోజకవర్గ నాయకులు బీర్ల శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి సమక్షంలో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆ పార్టీ నాయకులు దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



