- Advertisement -
- – 141 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ..
– యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకలి గణేష్ గౌడ్.. - నవతెలంగాణ- చారకొండ
- చారకొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు
ఎరుకల గణేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ గణేష్ గౌడ్…… బ్రిటిష్ పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఆయన అన్నారు. విద్య, వైద్యం వ్యవసాయం రంగాలకు ప్రాధ్యాణ్యత ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ గోరేటి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి మహేందర్, పానుగంటి అంజయ్య, జగన్ మోహన్, సాయి కృష్ణ, నారోజు నరసింహ చారి, చారకొండ విజయ్, చారగొండ మల్లేష్, చింతపల్లి జంగులు, సుంకరి రామకృష్ణ, మారిపాకుల గణేష్, మైనార్టీ అధ్యక్షులు సత్తార్, పిల్లి శ్రీరాములు, నందిని, పసుల వెంకట్ రెడ్డి, కుకుడాల శ్రీనివాస్, కంది కంటి శ్యామ్, తిరుమలేష్, జూలూరి లక్ష్మణ్, రాజు తదితరులు ఉన్నారు.
- Advertisement -



