Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్సాన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ చేరికలు.!

అన్సాన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ చేరికలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అన్సాన్పల్లి లోని కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శీను బాబు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఆన్సాన్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో దొంగల మహేందర్, కంచం సంపత్, పాతపల్లె చందుర్, నానుమాల స్వామి, ముత్యాల వెంకటేష్, బోధుమల భద్రయ్య, నోముల కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేల్పుల భాగ్యలక్ష్మి చంద్రయ్య, పైడాకుల ప్రమీల, బొద్దుల స్వప్న, ఇంజపూరి ఓదెలు, గుగులోతు రాజ్, జాటోత్ రాజ్, బొద్దుల రాజయ్య, బానోతు సుమన్, శనిగరం రాజు చేరారు. వారికి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మండల రాహుల్, మంథని మార్కెట్ డైరెక్టర్ దూలం సులోచన, మాజీ సర్పంచ్ గూగులోత్ జగన్ నాయక్, భూక్య రఘు, కుడుముల శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -