నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు జన్మదినం సందర్భంగా పూరి జగన్నాథ్ ఆలయంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. మద్నూర్ మండల నాయకులు, మిర్జాపూర్ హనుమాన్ మందిర్ ఛైర్మన్ రామ్ పటేల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హన్మంత్ యాదవ్, సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు వాట్నాల్వార్ రమేష్ , మాజీ పీఏసీఎస్ చైర్మన్ కొండా గంగాధర్ , సీనియర్ నాయకులు దేవీదాస్ పటేల్ ,శివ, ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆరోగ్యం, ఆయుష్షుతో కలిసి ప్రజాసేవలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ భగవంతునితో కోరుకున్నట్లు పూరి జగన్నాథ్ నుండి నాయకులు తెలియజేశారు.
పూరి జగన్నాథ్ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES