Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ

బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ

- Advertisement -

పాలడుగు వెంకట కష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట

ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. శనివారం మండలంలో ఇటీవల మృతి చెందిన బాధ్యత కుటుంబాలను వెంకటకృష్ణ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మండల కేంద్రానికి చెందిన తుమ్మల భద్రయ్య, మామిడి అన్నమ్మ మరియు వల్లపుదాసు లచ్చమ్మ  గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలను గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మండల నాయకులు సూరపనేని సాయిబాబు, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర రావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్యా రాజు, మాజీ ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, మాజీ సర్పంచ్ లావుడ్య లక్ష్మి -జోగా నాయక్, వంగూరి నాని తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -