ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్
నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామానికి చెందిన కొంగర సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆదివారం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ సదయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. పార్టీ కార్యకర్తలకు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా కార్మిక శాఖా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇస్సార్ ఖాన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య గార్లతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
సదయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES