రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సాగించిందనీ, సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో భారీ విజయం సాధ్యమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. నూతన ఉత్సాహం తో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా చేసిన కృషి, ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం చేకూరిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎన్నో కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తన నియోజకవర్గం వనపర్తి, పెబ్బేరు మున్సిపల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభంజనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



