ఏఐసీసీ పరిశీలకులు దేబాసిన్ పట్నాయక్
నవతెలంగాణ – పాలకుర్తి
ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకులకే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు దేబాసిన్ పట్నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి పరిశీలకులు, ఎమ్మెల్యే శంకర్, ఎండి అవేజ్, శ్రీకాంత్ యాదవ్, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డితో కలిసి దేబాసిన్ పట్నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశాలను నిర్వహిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి దరఖాస్తు చేసుకోవడంతో పాలకుర్తి నియోజకవర్గం లోని కార్యకర్తలతో అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేసే ఝాన్సీ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించాలని కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని తెలిపారు. ప్రజల మధ్య నుండి, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్న నాయకులను నియమించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లను పరిశీలనకు ఏఐసీసీకి పంపుతామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎన్నికతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రియస్వామ్యం మరింత బలపడుతుందని తెలిపారు.
నిజమైన ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల అభిప్రాయం, అంగీకారంతోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు ఎంపిక చేస్తామని తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షుల దరఖాస్తు ఫారాన్ని ఆవిష్కరించారు. ప్రజల కోసం పనిచేసే నాయకులకే పదవులు ఇవ్వాలని కార్యకర్తలు పరిశీలకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, టీపీసీసీ మెంబర్ డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, తొర్రూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధారావత్ సురేష్ నాయక్, నల్ల శ్రీరామ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్లు వీరమనేని యాకాంతరావు, అడ్డూరి రవీందర్రావు, దేవస్థానం మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తిలతో పాటు జిల్లా నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, కమ్మగాని నాగన్న గౌడ్, పెనుగొండ రమేష్, మొలుగూరి యాకయ్య గౌడ్, నలమాస రమేష్ గౌడ్, అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్, బండిపెళ్లి మనమ్మ, మాదాసు హరీష్ గౌడ్, గాదపాక భాస్కర్, ఐలేష్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఝాన్సీ రెడ్డి కె కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి
ప్రజాసేవలో ముందుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, నాయకులను, కార్యకర్తలను సమన్వయంతో పని చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డికే జిల్లా కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష అభ్యర్థుల అభిప్రాయ సేకరణకు హాజరైన పరిశీలకులకు తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చారు. ఝాన్సీ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఝాన్సీ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీకి పంపించాలని సూచించారు.