Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్బీ స్టేడియానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు.. 

ఎల్బీ స్టేడియానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు.. 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండల వ్యాప్తంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే జై బాబు- జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం ఉన్న బహిరంగ సభ కు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు. ఈ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతిదిగా పాల్గొన్న నేపథ్యంలో మండలంలోని గ్రామస్థాయి మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు అంతా పెద్ద ఎత్తున బయలుదేరారు. అందులో భాగంగా నార్లాపూర్ నుండి

కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది. అందర్నీ ఒక వేదిక పైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జులై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్ధంగా పనిచేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. సెంట్రల్ నాయకులు ఏరియా వైస్ ప్రెసిడెంట్ పార్టీలోని అందరు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప వీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాపోలు సంజీవరెడ్డి, నాయకులు రుణావత్ శ్రీను, ఎనగంటి లక్ష్మయ్య, మడకం శోభన్, సమ్మయ్య, మాచర్ల రాజు, మొక్క దుర్గయ్య, ఆకుల సమ్మయ్య, తోలం కృష్ణ, కారింగుల రాంబాబు, ఆకుల సమ్మయ్య, సంతోష్ రెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -