Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ములేకే కాంగ్రెస్‌ రిజర్వేషన్ల డ్రామా :చల్లా ధర్మారెడ్డి

స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ములేకే కాంగ్రెస్‌ రిజర్వేషన్ల డ్రామా :చల్లా ధర్మారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేకనే 42 శాతం రిజర్వేషన్లు అంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసంచేస్తున్నదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మాయ మాటలు చెప్పి గతంలో బిసిలను మోసం చేసి గద్దెనెక్కింది ఈ కాంగ్రెస్. ఇప్పుడు కూడా అదే మోసంతో స్థానిక సంస్థ ఎన్నికల్లో లభిపొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. ఈ నోటిఫికేషన్ వల్ల ఇప్పటికే గ్రామాలలో ఆశావాహులు ఖర్చులపాలయ్యారు. వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 420 హామీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొట్లాడాలి,అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలి. ఢిల్లీ వేదికగా జరగాల్సిన పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి గల్లీలో చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని,వారి చేతుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -