కాంగ్రెస్ పార్టీ బాకీలపై ప్రజలను చైతన్యం చేయాలి
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు గుణపాఠమే
మాజీ మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ – పాలకుర్తి
22 నెలల కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో అదొగతిగా సాగుతుందని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలో గల బిఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు బాకీ ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని కష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు చేస్తున్న మోసాల పట్ల ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అదొగతిలో కాంగ్రెస్ పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES