– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామనీ, కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ, గతంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమకు పరిపాలన చేతకావడం లేదనీ, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని నేరుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బాన్సువాడ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరాను ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన 21 నెలల్లోనే ప్రజల నుంచి సంపూర్ణ వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. హామీల వైఫల్యం, నమ్మకద్రోహం ఒక కారణమయితే, సీఎం రేవంత్ రెడ్డి మాటల తీరు, వ్యవహార శైలి మరో ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిక్షణం కేసీఆర్ పేరు తలుచుకుంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాకనే గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆ పార్టీ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం కేవలం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. అయితే, ఈ 21 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2.20 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందనీ, ఆ అప్పుతో ఏ ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తోందని ఆరోపించారు. యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని చెప్పారు. పంటల కొనుగోళ్లకు, ఆ తర్వాత వాటికి ఇవ్వాల్సిన బోనస్‌ను ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే యూరియా సరఫరా చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనీ, స్పీకర్ లేదా ఫిరాయిం పుదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గడువు లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ హెచ్చరించారు. పోచారం ఎమ్మెల్యే పదవి కూడా పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. . వీరిలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బాన్సువాడ నార్ల రత్న కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేష్, మాజీ కో-ఆప్షన్ హకీమ్ తదితరులు ఉన్నారు.
పాలన చేతకాని కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES