గంధం రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు
ఏఐసీసీ పరిశీలకులు బస్విరంజన్ మహంతి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నవతెలంగాణ – మిర్యాలగూడ
కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు బస్వీరంజన్ మహంతి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు అన్నారు. గురువారం స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్ లో తాజా మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు లేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రామకృష్ణ ఎంతో కృషి చేశారని ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. రామకృష్ణ కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మాధవి, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, నూకల వణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, చిలుకూరి బాలు, గుండు నరేందర్, బసవయ్య గౌడ్, రామలింగ యాదవ్, చిరుమారి కృష్ణయ్య, ఏం ఏ సలీం, దేశిడి శేఖర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, బెజ్జం సాయి, జానీ, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు కాంగ్రెస్ అండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES