Sunday, May 11, 2025
Homeవరంగల్మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అండ 

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అండ 

- Advertisement -

రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య 
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మండలంలోని కాల్వపెళ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుర్రి సమ్మయ్య గారి తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుర్రి కన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా శనివారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లు దేవేందర్ లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ.10000 నగదు, బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. అనంతరం వెంగళాపూర్ గ్రామానికి చెందిన తెల్లం పుల్లయ్య గారి కుమార్తె ప్రియాంక కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా ఆమె దశదినకర్మకు కూడా రూ.10000 నగదు 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య మాట్లాడుతూ వారు చాలా మంచివారని వారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, డైరెక్టర్ మల్లయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు భూషబోయిన రవి, సీనియర్ నాయకులు బండారి చంద్రయ్య, కార్తీక్, శ్రావణ్, ఎర్రయ్య, రవీందర్ రెడ్డి, నర్సయ్య, రామనాథం, వెంకన్న, శ్రీను, బిక్షపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -