కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్
నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా కేంద్రంలో ఈనెల 29, 30, 31 తేదీలలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజవత్ నాయక్ కోరారు. నిజామాబాద్ హరిత హోటల్ లో శిక్షణ తరగతుల ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ పరిశీలించారు. వారికి జిల్లా కాంగ్రెస్ఎస్టీ సెల్ అధ్యక్షులు కేతావత్ యాదగిరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులతో బెల్లయ్య నాయక్ సమావేశం అయ్యారు. ఈ శిక్షణ తరగతులకు ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క, ముగింపు కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని బెల్లయ్య నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎస్టీ సెల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుభాష్ జాదవ్, మాజీ ఎంపీపీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES