Wednesday, May 28, 2025
Homeకరీంనగర్కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ 

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ 

- Advertisement -
  • – ప్రోటోకాల్ వివాదంపై రగడ
    – ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకుల యత్నం
    – అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు  
    – ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీచార్జ్ 
    – పలువురి నేతల అరెస్టు, స్టేషన్కు తరలింపు
    నవతెలంగాణ సిరిసిల్ల టౌన్ 
  • సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. సోమవారం ప్రొటోకాల్ పాటించాలని డిమాండ్ చేస్తూ, కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరినొకరు  తోపులాట చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు  నెలకొన్నాయి.  అప్పటికే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేసి ఇరు వర్గాలను చెదర గోట్టారు. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -