Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలౌకికవాద పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్‌

లౌకికవాద పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్‌

- Advertisement -

నవీన్‌ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్‌ పని చేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లోని ఫిలిం కల్చరల్‌ క్లబ్‌లో శనివారం క్రైస్తవ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను ఆశీర్వదించి, దీవించడం కోసం ఇక్కడకు వచ్చిన పాస్టర్లకు, క్రైస్తవ సంఘ ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి ఎదగడం కోసం.. వారిని ముందుకు నడిపించడం కోసం కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించా ల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నవీన్‌ యాదవ్‌ గెలుపు కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని కోరారు. నవీన్‌ను గెలిపించి ఈ ప్రభుత్వాన్ని దీవించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజ హితం కోసం ప్రజా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోం దన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుం దన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అరచేతుల్లో పెట్టి రక్షించుకోవాల్సిన కర్తవ్యం మీ అందరిపై ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -