Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కష్టపడ్డ వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది: పీఏసీఎస్ చైర్మన్

కష్టపడ్డ వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది: పీఏసీఎస్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కష్టపడ్డ వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అందుబాటులో ఉంటూ శ్రీపాద ట్రస్ట్ ద్వారా చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబును నియమించడం జరిగిందని తెలిపారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తేలినట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఇది నిదర్శనమన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కష్టపడి పని చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా పార్టీ వదిలిపెట్టదని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -