Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకష్టకాలంలో కార్యకర్తలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: మంత్రి సీతక్క

కష్టకాలంలో కార్యకర్తలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట్ 
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని చల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి లచ్చమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంత్రి సీతక్క మొగిలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కార్యకర్తల కష్టాల్లో పాలు పంచుకుంటూ అండగా ఉండి ధైర్యాన్ని కల్పిస్తామని, అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి గార్లతో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad