గొంది కిరణ్.. ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
అనారోగ్యంతో మృతి చెందిన పొడి శట్టి సమ్మయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్ అన్నారు. శనివారం మండలంలోని పసర పంచాయితీ మోద్దులగూడెం గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన పొడిశెట్టి సమ్మయ్య పార్థివ దేహానికి కిరణ్ నివాళులు అర్పించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. సమ్మయ్య మృతి బాధాకరమని, మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం తోడుగా ఉండి కష్ట కాలంలో ఆదుకుంటుందని అన్నారు.
అనంతరం రూ.5500/- కిరణ్ తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సహాయంగా సమ్మయ్య కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన రవి, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండేం శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపాల ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు బర్ల సమ్మిరెడ్డి,వాసం శ్రావణ్, చింతపండు లక్ష్మి నారాయణ, నద్దునూరి రతన్,దార్ల విద్యాసాగర్, బర్ల కిరణ్ రెడ్డి,బుర్రి సాంబయ్య, రసపుత్ గిరి మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సమ్మయ్య కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES