Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 140 స్థానాలు కాంగ్రెస్ కైవసం 

మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 140 స్థానాలు కాంగ్రెస్ కైవసం 

- Advertisement -

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి 
నవతెలంగాణ – కంఠేశ్వర్

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన పై ఉన్న నమ్మకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించడం జరిగిందని, ఈ సందర్భంగా సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రతి ఇంటికి గృహ జ్యోతి పేరుతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ, స్కాలర్షిప్, వివిధ కాంట్రాక్టు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తుందని అన్నారు. అదేవిధంగా మహిళల సాధికారత కొరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలో సుమారు 80% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది అని ఆయన వెల్లడించారు. ఈ  సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవదల్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, మహమ్మద్ ఈసా ,అబ్దుల్ ఎజాజ్ ,సాయికిరణ్, శివ  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -