Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదాద్రి ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం

యాదాద్రి ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – ఆలేరు

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ  విజయ బావుట ఎగరవేసిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ అధ్యక్ష తన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువైందన్నారు.జిల్లాలోని అన్ని చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం అన్నారు.

గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం గుర్తు చేశారు. రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కూడా ఇది పునరావృతం అవుతుందన్నారు.సామాజిక పొందుకలో కొందరికి సీట్లు రానివారు అధైర్య పడాల్సిన పని లేదన్నారు.మార్కెట్ కమిటీ పి ఎ సి ఎస్ కార్పొరేషన్లుల లో నామినేట్ పోస్టులలో వారికి అవకాశం ఉంటుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ. బిజెపికి లోపాయికారిగా సహకరించడం వల్లే యాదిరిగుట్టలో ఆ రెండు సీట్లు బిజెపికి  వచ్చాయి.కేవలం ఒకే ఒక సీటు బీఆర్ఎస్ పరిమితమైందన్నారు. ఆలేరులో 54 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే బీఆర్ఎస్ కు కేవలం 34 శాతం ఓట్లే వచ్చాయని20 శాతం ఓట్లతో కాంగ్రెస్ చాలా ముందున్న విషయం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజా ప్రభుత్వం ప్రజ పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుందన్నారు.

ఆలేరులో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యేలు సునీత మహేందర్ రెడ్డి బిక్షమయ్య గౌడ్ కల్లూరు రామచంద్రారెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజలు మూడు సీట్లకు పరిమితం చేశారన్నారు. గొంగిడి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ క్లీన్ షిప్ చేస్తుందని ప్రగల్బాల్ పలికావు రెండు మున్సిపాలిటీల్లో కేవలం నాలుగు స్థానాలకు నీ పార్టీనీ పరిమితం చేశావెందుకు అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి 16 స్థానాలు కైవసం చేసుకుందన్నారు. బిజెపికి అవయవ దానం చేసి నాలుగు స్థానాలు గెలిపించవన్నారు. ధైర్యం ఉంటే బిజెపి బిఆర్ఎస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని హెద్దేవ చేశారు. రెండు మున్సిపాలిటీలో 24 స్థానాల్లో 67% కౌన్సిలర్లుగా కాంగ్రెస్ వైపు నుండి గెలిస్తే  బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కూడా 33 శాతానికి కౌన్సిలర్లుగా ఎనిమిది సీట్లకు పరిమితమయ్యారని బిఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది అన్నారు.

గుట్ట ఆలేరు లో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి వల్ల ఈ విజయం Conversation వీరితోపాటు మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు  శోభారాణి, టి పి సి పి కార్యదర్శి జగన్, ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకట స్వామి, ఆలేర్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సిపిఐఎం పట్టణ కార్యదర్శి ఎం ఏ ఎక్బల్, సిపిఐ  మండల కార్యదర్శి చెక్క వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏగ్గిడి యాదగిరి, కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, ఎమ్మెస్ విజయకుమార్, ఆకవరం మోహన్ రావు, ఎండి జైనుద్దీన్, చింతల ఫణి శ్రీనివాస్ రెడ్డి, ఎండి బాబా సర్పంచులు ఉప సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -