Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం

- Advertisement -

వనపర్తిలో రెండు స్థానాల్లో సీపీఐ(ఎం) విజయం
కోస్గీలో క్లీన్‌ స్వీప్‌


నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
నూతనంగా ఏర్పడిన మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని విశ్లేషకుల అభిప్రాయం. మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేసినా…అధికార పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. కోస్గీలో కాంగ్రెస్‌ 16 స్థానాలకు 16 కైవసం చేసుకుంది. అమరచింత, వనపర్తిలో రెండు స్థానాలలో సీపీఐ(ఎం) విజయం సాధించింది. మొత్తంగా కాంగ్రెస్‌ 12, బీఆర్‌ఎస్‌1, బీజేపీ 1, ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఒక మున్సిపాల్టీలో విజయం సాధించాయి. మూడు మున్సిపాల్టీలలో హంగ్‌ ఏర్పడినా స్వతంత్రుల సహకారంతో చైర్‌పర్సన్‌ సీటును చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌, బీజేపీలు గట్టి పోటీనిచ్చాయి. బీజేపీని పట్టణ ప్రజలు తిరస్కరించారు.

ఊహించని ఫలితాలు
ఉమ్మడి జిల్లాలో జరిగిన కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు ఊహకందని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నా ఊహించని విధంగా ఓటర్లు తమ ఎన్నికల్లో తీర్పు చెప్పారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌ బీజేపీతో ఉన్న అవగాహన వల్ల ఈసారి బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -