Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు

రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను ఎర్రమంజిల్‌లోని ఫైనాన్స్ కమిషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం కాటారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీరెల్లి రజిని కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాటారం మండలంలోని అభివృద్ధి అంశాలు, గ్రామీణ మౌలిక వసతులు, స్థానిక సంస్థలకు అవసరమైన నిధుల కేటాయింపుపై చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా పంచాయతీలు, మున్సిపల్ స్థాయిలో ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.

యువ నాయకుడు రజిని కుమార్ చొరవను చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ప్రశంసిస్తూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీతో కాటారం ప్రాంత అభివృద్ధిపై సానుకూల ఆశలు పెరిగాయని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -