Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త సీసాలో పాత సారా వల్లె కాంగ్రెస్ తీరు 

కొత్త సీసాలో పాత సారా వల్లె కాంగ్రెస్ తీరు 

- Advertisement -

కేసీఆర్ హయాంలో ఇచ్చిన నిధుల్నే.. రెండేళ్ల తర్వాత పేరు మార్చి ఇస్తుండ్రు
దుబ్బాకకు కొత్తగా ఏమిస్తారో మంత్రి చెప్పాలి – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ 
నవతెలంగాణ – దుబ్బాక 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా దుబ్బాక మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరయ్యాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆ నిధుల్ని వెనక్కి తీసుకొని.. తిరిగి రెండేళ్ల తర్వాత ‘ పట్టణాభివృద్ధి’ పేరిట రూ.15 కోట్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకోవడం.. కొత్త సీసాలో పాత సారా వలే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం దుబ్బాకలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే దుబ్బాకలో ఐఓసీ, 100 బెడ్స్ హాస్పిటల్, ఐటీఐ కాలేజ్, బస్టాండ్, కేసీఆర్ స్కూల్, డబుల్ బెడ్రూంలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు.

కాంగ్రెస్ సర్కార్ వచ్చిన రెండేళ్లలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా తాను ఒక్క అభివృద్ధికి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవని, ఇది పూర్తిగా అందాఖానూన్ ప్రభుత్వం లా ఉందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆగ మేఘాల మీద దుబ్బాక మున్సిపాలిటీలో శంకుస్థాపనలు చేసేందుకు మంత్రి రావడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తగా దుబ్బాకకు ఎన్ని నిధులు మంజూరు చేస్తారో చెప్పాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని డిమాండ్ చేశారు. అనంతరం దుబ్బాక మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన పర్స దేవరాజ్ ముదిరాజ్ (అచ్చుమాయిపల్లి సర్పంచ్) ను ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు వంశీకృష్ణ, శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు యాదగిరి, స్వామి, భూమిరెడ్డి, బండి రాజు, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -